కావలసినవి
నెయ్యి : రెండు చెంచాలు , బియ్యం : అరకప్పు ,
నీళ్లు : కప్పు ,
కొబ్బరిపాలు : అరకప్పు , కొబ్బరి ముద్ద : రెండు చెంచాలు , బెల్లం తరుగు : పావుకప్పు , యాలకుల పొడి : అరచెంచా , జీడిపప్పు ముద్ద : రెండు చెంచాలు ,
జీడిపప్పు , కిస్మిస్ పలుకులు : రెండూ కలిపి పావుకప్పు ,
తయారీ విధానం
కడిగిన బియ్యాన్ని ఓ గిన్నెలో తీసుకుని నీళ్లు పోసి స్టౌమీద పెట్టి మధ్యమధ్య కలుపుతూ ఉండాలి . ఆ నీళ్లన్నీ ఆవిరైపోయాక కొబ్బరిపాలు పోసి స్టౌని సిమ్లో పెట్టాలి . అవి కూడా ఆవిరైపోయాక బెల్లం తరుగు , కొబ్బరిముద్ద , జీడిపప్పు ముద్ద , యాలకులపొడి వేసి బాగా కలపాలి . ఇది పరమాన్నంలా తయారయ్యాక దింపేసి స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి . అది వేడెక్కాక జీడిపప్పు , కిస్మిస్ పలుకులు వేయించి, పరమాన్నం పైన వేసి ఓసారి కలపాలి ..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి