నువ్వుల పులిహోర||nuvvula pulihora|| puliogari||breakfast recipes|| tasty food ideas ||easy rice dishes
కావలసినవి
బియ్యం : కప్పు ,
నువ్వుల నూనె : మూడు టేబుల్స్పూన్లు ,
ఆవాలు : చెంచా ,
మినప్పప్పు : చెంచా ,
సెనగపప్పు : 2టేబుల్స్పూను , పల్లీలు : పావుకప్పు ,
కరివేపాకు రెబ్బలు : రెండు , ఎండుమిర్చి : రెండు ,
ఇంగువ : పావుచెంచా ,
బెల్లం తరుగు : చెంచా , చింతపండు : నిమ్మకాయంత , ఉప్పు : తగినంత ,
పసుపు : పావుచెంచా .
మసాలాకోసం :
దనియాలు : ఒకటిన్నర చెంచా , సెనగపప్పు : ఒకటి న్నర చెంచా , మినప్పప్పు : ముప్పావుచెంచా , మెంతులు : అరచెంచా , ఎండుమిర్చి : నాలుగు , మిరియాలు : అరచెంచా ,
జీలకర్ర : పావుచెంచా ,
నువ్వులు : రెండు చెంచాలు , కరివేపాకు రెబ్బలు : నాలుగు .
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని కడిగి అన్న పొడిపొడిగా వండి పెట్టుకోవాలి . అదేవిధంగా మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలను నూనె లేకుండా వేయించుకుని తరువాత పొడి కొట్టుకుని పెట్టుకోవాలి . ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు , ఇంగువ , మినప్పప్పు , సెనగ పప్పు , పల్లీలు , ఎండుమిర్చి , కరివేపాకు వేయించుకుని అందులో చింత పండు రసం వేయాలి . చింత పండు రసం ఉడికాక పసుపు , బెల్లం తరుగు , చేసిపెట్టుకున్న మసాలా రెండు చెంచాలు , తగి నంత ఉప్పు వేసి బాగా కలపాలి . ఈ పులుసు చిక్కగా అయ్యాక అన్నం పైన వేసి బాగా కలపాలి . అంతే ఎంతో రుచకరమైన నువ్వుల పులిహోర తయారయింది😋😋.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి