అటుకుల దద్దోజనం



కావలసినవి
 మందంగా ఉండే అటుకులు : కప్పు ,
 పెరుగు : | ఒకటిన్నర కప్పు , పాలు : పావుకప్పు , 
పచ్చిమిర్చి : రెండు , 
అల్లం తరుగు చెంచా
ఆవాలు : ముప్పావుచెంచా , సెనగపప్పు : ముప్పావుచెంచా , మినప్పప్పు : చెంచా ,
 పల్లీలు : రెండు చెంచాలు ,
 ఉప్పు : తగినంత , 
నెయ్యి : రెండు చెంచాలు , కరివేపాకు రెబ్బలు : రెండు , కొత్తిమీర తరుగు : చెంచా , ఎండుమిర్చి : ఒకటి 

తయారీ విధానం 
అటుకుల్ని ఓసారి కడిగి నీళ్లు గట్టిగా పిండి ఓ గిన్నెలో వేసుకోవాలి . అందులో పెరుగు , పాలు , తగినంత ఉప్పు , అల్లంతరుగు , పచ్చిమిర్చి తరుగు వేసి కలిపి పెట్టుకోవాలి . ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి . అది వేడెక్కాక తాలింపు దినుసులన్నీ వేసి ఎర్రగా వేయించుకుని , కరివేపాకు వేసి స్టౌ కట్టేయాలి . ఈ తాలింపు వేడి కొద్దిగా తగ్గాక పెరుగు పైన వేసి బాగా కలిపి కొత్తిమీర వేస్తే చాలు .

కామెంట్‌లు