కాలి ఫ్లవర్ 65|| cauliflower 65

కావలసినవి:
కాలీఫ్లవర్ చిన్నది 1
ఉప్పు ఒక టేబుల్ స్పూన్
 కారం ఒక టేబుల్ స్పూన్
 అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్
 పసుపు చిటికెడు 
మసాలా చిటికెడు 
శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు
మొక్కజొన్న పిండి రెండు టేబుల్ స్పూన్లు


తయారు చేసే విధానం:

ముందుగా కాలిఫ్లవర్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి  స్టా  మీద బాండీ పెట్టి అందులో కొంచెం నీళ్లు పోసుకుని కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా వేడి చేయాలి ఇప్పుడు వేడి నీళ్లలో వేసుకుని ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి .

ఉడికిన తర్వాత ముక్కల్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు ప్లేట్లో ఉప్పు కారం సెనగ పిండి మొక్కజొన్న పిండి వేసుకుని ముక్కలకు బాగా పట్టించాలి

స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసుకుని కాలిఫ్లవర్ ముక్కల్ని కొన్ని కొన్ని వేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి

ముక్కలని డిప్ ఫ్రై అయిన తర్వాత ఆఖర్లో పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అంతే చాలా క్రిస్పీ స్పైసీగా ఉండే కాలీఫ్లవర్ 65 రెడీ..

కామెంట్‌లు